విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి..

by Bhanu |

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మూడు పాడిగేదెలు మృతి చెందిన సంఘటన సోమవారం నారాయణపురం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి..
X

దిశ, నడిగూడెం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మూడు పాడిగేదెలు మృతి చెందిన సంఘటన సోమవారం నారాయణపురం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తీగల యుగేందర్ రెడ్డి చెందిన రెండు, సైదిరెడ్డికి చెందిన ఒక గేదె రోజు మాదిరిగా మేతకు వెళ్లగా గ్రామ శివారులో గల పంట పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. వీటి విలువ రూ. 2 లక్షల వరకు వుంటుందని, ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందించాలని వారు కోరారు.

Next Story