- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎండ, వానకి కష్టపడ్డ కార్యకర్తలకి నో ఛాన్స్..
పొగడ్తలు కార్యకర్తలకు. అవకాశాలు అంగ, అర్థ బలం ఉన్న నేతలకు.

దిశ,సూర్యాపేట: ‘పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది.. పార్టీకి బలం..బలగం కార్యకర్తలే.. కష్ట కాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారిని మరిచిపోం... అంటూ’ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ వట్టి మాటలేనని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని మొండిచేయ్యే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక..వాననక పనిచేసినవారికి సూర్యాపేట మున్సిపాలిటీ లో కౌన్సిలర్ కోసం పోటీకి నిలుస్తున్న ఆయా పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా డబ్బున్న వారికే టికెట్ ఇస్తామని పార్టీ నాయకులు తెలపడంతో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బరిలో ఉండాలనుకుంటున్న ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. కౌన్సిలర్ గెలవాలంటే డబ్బులు ఖర్చుపెట్టే నాయకులను బరిలో దింపే ఆలోచనల్లో పలు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. -దిశ,సూర్యాపేట
ఎండనక, వాననక కష్టపడ్డ కార్యకర్తలకి టికెట్టు లేదంటూ ఆయా రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలకి తెలపడంతో కార్యకర్తలు చీ చిల్లర రాజకీయం అంటూ ఆయా పార్టీల నాయకులపై గుర్రుమంటున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ లో కౌన్సిలర్ కోసం పోటీకి నిలుస్తున్న ఆయా పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా డబ్బున్న వారికే టికెట్ ఇస్తామని పార్టీ నాయకులు తెలపడంతో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వార్డుల వారి ఓటర్లకు సంబంధించిన తుది జాబితా విడుదల కావడం రిజర్వేషన్ల ప్రకటన కూడా పూర్తి కావడంతో పార్టీలు పోరుకు సిద్ధమవుతున్నాయి. బరిలో ఉండాలనుకుంటున్న ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలను కూడా ధన రాజకీయాలే ప్రభావితం చేశాయి. జిల్లాలోని మున్సిపాలిటీలలో కౌన్సిలర్ గెలవాలంటే డబ్బులు ఖర్చుపెట్టే నాయకులను బరిలో దింపే ఆలోచనల్లో పలు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు కూడా ఆర్థికంగా బలం ఉన్న నాయకుల వైపే మొగ్గు చూపించే వాతావరణం కనిపించడంతో పార్టీ కోసం పని చేసిన వారు పార్టీ కోసం షాడోగా పనిచేసినవారికి పార్టీ టికెట్ ఇవ్వమని ఆయా పార్టీల నాయకులు చెప్పడంతో ఈ చిల్లర రాజకీయం కోసమేనా మేము ఇన్ని రోజులు కష్టపడిందని నెత్తిమద నోరు పెట్టుకొని కార్యకర్తలు బాధపడుతున్నారు.
ఆర్థికంగా ఉంటేనే అభ్యర్థిత్వం..
అన్ని పార్టీలు ఆర్థికంగా కాస్త ఉన్నవారినే పురపోరులో బరిలో దింపాలని చూస్తున్నాయి. అన్ని పార్టీలు పార్టీ ఫండ్ తో పాటు ఎన్నికల్లో స్వయంగా ఖర్చు చేసే నేతల వైపే చూస్తున్నాయి. అన్నిపార్టీలతో పోలిస్తే అర్థబలం, అంగబలంలో బీఆర్ ఎస్ పార్టీ అందరి కన్నా మెరుగ్గా ఉంది. బీఆర్ఎస్ కు ధీటుగా ఎదగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏదేమైనా ఈసారి మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్ జెండా ఎగరాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల ఖర్చులో కూడా రెండు పార్టీలు ఏమాత్రమూ తగ్గకుండా నిధుల సమీకరణ ఉండనుందని తెలిసింది. అభ్యర్థుల్ని తట్టుకోవాలంటే పార్టీ ఇచ్చే నిధులతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వారినే బరిలో నిలపాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి.
డబ్బులతోటి కీలకం"
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పోటీచేయాలని భావిస్తున్న వారు డబ్బులు సమకూర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో ఖర్చుల కోసం డబ్బులను ఈలోపే సర్దుబాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చు తడిసి మోపెడైంది. కనీసం 500 మంది ఓటర్లు లేని పంచాయతీల్లో కూడా అభ్యర్థుల ఖర్చు రూ.5 లక్షలు దాటింది. ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలు మరింత కాస్లీగా ఉండనున్నాయి. ఒక్కో వార్డులో సగటున 2,200 జనాభా ఉంటే కనీసం 1800 పైగా ఓటర్ల ఉండే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ వార్డుల్లో పోటీలో ఉండే ఒక్కో అభ్యర్థికి సుమారు గా రూ.30 లక్షల కన్నా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు పార్టీ కోసం పని చేసిన వారిని పక్కకు నెట్టి ఓటర్లకి డబ్బులు ఖర్చు పెట్టి, మద్యం ఇచ్చి ఓట్లు వేసుకునే వారికే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయా పార్టీల కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రధాన పార్టీలు పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని డబ్బులు ఖర్చు పెట్టేవారిని పక్కకు నెట్టాలని కౌన్సిలర్ గా పోటీ చేసే ఆశావహులు కోరుకుంటున్నారు.






