- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలిగొండలో పులి..? సోషల్ మీడియాలో హల్ చల్
వలిగొండ పట్టణంలోని గుట్ట పైన పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తుందని సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

X
దిశ, వలిగొండ : వలిగొండ పట్టణంలోని గుట్ట పైన పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తుందని సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వలిగొండ ప్రజలతో పాటు, చుట్టుపక్కల గ్రామాల వాసులు, రైతులు, గొర్రెల, మేకల, పశువుల కాపరులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ ఫోటోలు ఒరిజినల్ ఫోటోలా, లేక టెక్నాలజీ ఉపయోగించి సృష్టించినవా జనాలకు ఏమి పాలుపోవడం లేదు. వెంటనే అధికారులు స్పందించి పులి సంచారం నిజమో కాదో నిర్ధారణ చేసి భయభ్రాంతులకు గురవుతున్న వారికి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పులి సంచరిస్తుండటం నిజం అయితే ప్రజలకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, ఫారెస్ట్ అధికారుల చొరవతో పులిని పట్టుకొనుటకు గల చర్యలు చేపట్టగలరని ప్రజలు కోరుతున్నారు.
Next Story






