- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని పోలింగ్ కేంద్రాలను, వాటి పరిసరాలను పరిశీలించాలని సూర్యాపేట ఎస్పీ కె నరసింహ పోలీస్ అధికారులకు సూచించారు.

దిశ, నేరేడుచర్ల : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని పోలింగ్ కేంద్రాలను, వాటి పరిసరాలను పరిశీలించాలని సూర్యాపేట ఎస్పీ కె నరసింహ పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ నిర్వహణ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయంగా పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేయాలని సూచించారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పౌరులు ఎన్నికల నియమావళికి కట్టుబడి నడుచుకోవాలని ఎన్నికల నియమావళిని ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిపై సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై పోలీసు నిఘా ఉంచాలని కోరారు. మున్సిపల్ వార్డుల ఎన్నికలకు బరిలో ఉన్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం.. ప్రచారం చేసుకోవాలని ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా చూడాలన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పోలీస్ శాఖ నూతనంగా చేపట్టిన ఇంటి వద్ద నుండే ఎఫ్ఐఆర్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఎస్పీ వెంట స్థానిక ఎస్సై రవీందర్, సిబ్బంది ఉన్నారు.






