- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండ జిల్లా వాసులు తెగ తాగేశారు..!
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రి

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే ఏడాది గడిచిన 22 రోజుల వ్యవధిలోనే 100% పైగా విక్రయాలు సాగాయి అంటే నల్లగొండ ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలు ఈ విధంగా సాగాయి అవగతమవుతుంది. నూతన మద్యం పాలసీ, గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలు పెరగడం కూడా కారణంగా చెప్పవచ్చు. మూడు నల్లగొండ జిల్లాలో గడచిన 22 రోజులలో రూ. 427.03 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మూడు నల్లగొండ జిల్లాలో నల్లగొండ డిపో పరిధిలో అత్యధిక మద్యం అమ్మకం జరిగింది. ఇటీవల తీసిన లెక్కలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మద్యం విక్రయాలలో టాప్ ప్లేస్ దక్కించుకుందంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. మరో రెండు నెలలపాటు కూడా జిల్లాలో మద్యం అమ్మకాలు మరింత ఉపందుకోనున్నాయి.
రూ. 427.03 కోట్ల మద్యం విక్రయాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం రూ. 427.03 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. ఏడది డిసెంబర్ 1 తేదీ నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ డిపో పరిధిలో నువ్వు 208. 14 కోట్ల అమ్మకాలు జరగా, సూర్యాపేట డిపో పరిధిలో 116.25 కోట్లు, యాదాద్రి భువనగిరి డిపో పరిధిలో 102.63 కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం 211. 57 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా నల్లగొండ డిపో పరిధిలో 96.94 కోట్లు సూర్యాపేట డిపో పరిధిలో 60.59 కోట్లు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 54. 04 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ 22 రోజుల వ్యవధిలోనే 102% అదనంగా విక్రయాలు సాగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నెల ముగియడానికి మరో వారం రోజులకు అడుగు ఉండడంతో ఈ ఏడాది డిసెంబర్ నెల మద్యం విక్రయాలు ఎన్నడూ లేనంత రీతిలో జరిగే అవకాశం ఉంది.
బీర్ల అమ్మకాల జోరు..
అసలే చలికాలం.. బయటికి వెళ్లాలంటేనే చలితో ఇబ్బందులు పడుతున్న తరుణం. అయినా కానీ మద్యం ప్రియులు మాత్రం చల్లని బీరుని మాత్రం వదలడం లేదు. చలికాలం అయినా కానీ వీర్ల విక్రయాలు జోరు మాత్రం కొనసాగుతుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో మొత్తం 291035 కేసుల బీర్లు విక్రయాలు సాగగా నల్లగొండ డిపో పరిధిలో 135138 కేసులు, సూర్యాపేట డిపో పరిధిలో 75342 కేసులు, యాదాద్రి భువనగిరి డిపో పరిధిలో 80555 కేసుల బీర్లు అమ్మకాలు సాగాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఇప్పటివరకు మొత్తం 450456 కేసుల బీర్లు అమ్మకాలు సాగగా నల్లగొండ డిపో పరిధిలో 236051 కేసులు, సూర్యాపేట డిపో పరిధిలో 111450 కేసులు, యాదాద్రి భువనగిరి డిపో పరిధిలో 102955 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 30% శాతం బీర్ల విక్రయాలు అదనంగా సాగాయి.
మరింత ఆదాయం పెరిగే అవకాశం..
అబ్కారీ శాఖకు రానున్న రోజులలో మద్యం విక్రయాల ద్వారా మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో వారం రోజుల గడువులో గాని జనవరి కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సర వేడుకలలో కూడా మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉంది. అదేవిధంగా జనవరి నెలలో మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు తదనంతరం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల సైతం రాను ఉండడంతో మద్యం దుకాణాల జోరు పెరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో రెండు నెలల పాటు ఎన్నికలు ముఖ్యమైన పండుగలు రాను అనే నేపద్యంలో మద్యం దుకాణాల వ్యాపారులు మద్యం విక్రయాల ద్వారా మూడు పూవులు ఆరు కాయలుగా ఆదాయాన్ని సమకూర్చుకొనున్నారు.






