- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రి సబ్ సెంటర్ కు యజమాని తాళం..!
ఆస్పత్రి సబ్ సెంటర్ నుంచి రావలసిన అద్దె బకాయిలు రాకపోవడంతో భవన యజమాని నిరసన వ్యక్తం చేస్తూ తాళం వేశారు.

దిశ, తుంగతుర్తి : ఆస్పత్రి సబ్ సెంటర్ నుంచి రావలసిన అద్దె బకాయిలు రాకపోవడంతో భవన యజమాని నిరసన వ్యక్తం చేస్తూ తాళం వేశారు. అద్దె బకాయిలు చెల్లించే వరకు వేసిన తాళం తీసేది లేదంటూ మొండి పట్టుతో ఉన్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని రావులపల్లి పీహెచ్సీ పరిధిలో తుంగతుర్తిలోని ఎస్సీ కాలనీలో దాదాపు రెండేళ్ల క్రితం ఓ అద్దె భవనంలో ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనానికి ప్రతినెల రూ.2 వేలు చెల్లించే విధంగా అటు ఆసుపత్రి పై అధికారులు, భవన యజమాని మధ్య మొదట్లో ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు వివిధ రకాల విధుల నిమిత్తం సబ్ సెంటర్ లో ఇద్దరు ఏఎన్ఎం లతోపాటు ఒక మేల్ అసిస్టెంట్, పదిమంది ఆశాలు నియమితులయ్యారు. కాలానుగుణంగా అద్దె చెల్లించాలంటూ యజమాని పలుమార్లు పై స్థాయి వైద్యాధికారులకు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నప్పటికీ ఫలితాలు కనిపించలేదు. చివరికి ఓపిక నశించిన యజమాని బుధవారం ఆస్పత్రి సబ్ సెంటర్ భవనానికి తాళం వేశారు. విధుల నిమిత్తం సెంటర్ కు చేరుకున్న వైద్య సిబ్బంది బయటనే ఉండిపోయారు.






