municipal vice chairman : అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్..

by Batti.Sumithra |

భువనగిరి మున్సిపల్ అధికారులపై పట్టణ వైస్ చైర్మన్ మాయ దశరథ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

municipal vice chairman : అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి మున్సిపల్ అధికారులపై పట్టణ వైస్ చైర్మన్ మాయ దశరథ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భువనగిరి పట్టణంలో అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రారంభోత్సవానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే జిండాగేలు హాజరయ్యారు. ఈ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో మాయా దశరథ అభ్యంతరం తెలిపారు. అమృత్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని, ఇందులో ప్రధాని ఫోటో పెట్టకపోవడం ఏమిటని తీవ్రస్థాయిలో అధికారుల పై మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని సూచించారు.

Next Story