- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల కంటే దళారీలదే రాజ్యం
యూరియా కొనుగోళ్లలో రైతుల కంటే దళారీలదే రాజ్యమైంది. పంపిణీ విషయంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ దళారీ మాత్రం రైతు రూపంలో ప్రత్యక్షమవుతున్నారు.

రైతుల కంటే దళారీలదే రాజ్యం
- బ్లాక్ లో బస్తా ఒక్కంటికి రూ.450 నుండి రూ.500
- సక్రమంగా లేని యూరియా పంపిణీ
- అధికారులు, పోలీసుల కళ్లుగప్పి బ్లాక్ మార్కెట్ కు..
దిశ,తుంగతుర్తి: యూరియా కొనుగోళ్లలో రైతుల కంటే దళారీలదే రాజ్యమైంది. పంపిణీ విషయంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ దళారీ మాత్రం రైతు రూపంలో ప్రత్యక్షమవుతున్నారు. పంటలకు వేయాల్సిన యూరియా సమయం దాటిపోతుందనే ఆందోళన,ఆత్రుతతో రైతాంగం ఉంటే యూరియా బస్తాల మీద ఈరోజు ఎంత సంపాదించాలే అనే రీతిలో దళారి ఉంటున్నారు.ఈ లెక్కన రోజుల తరబడి తిరుగుతున్న రైతాంగానికి ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంటే దళారికి చేతికి మాత్రం సులువుగా అవి లభిస్తున్నాయి.అయితే యూరియా కావలసిన రైతులతో ముందుగా గుట్టుచప్పుడుతో ఒప్పందం చేసుకున్న దళారి ఒక్కో బస్తాను రూ.450 నుండి రూ.500 వరకు అమ్ముకుంటున్నారు.తుంగతుర్తి వ్యవసాయ సహాయ సంచాలకుల (ఏడిఏ) పరిధిలో తుంగతుర్తి,నూతనకల్, మద్దిరాల,అర్వపల్లి,నాగారం,తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. అయితే ఈ మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు రైతు సేవ సహకార సంఘాలు,గ్రోమోర్, తదితర ప్రైవేట్ ఫర్టిలైజర్స్ దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. యూరియా పంపిణీకి పరంగా ఆయా ప్రాంతాల్లో అధికారులు పలు నిబంధనలు పెట్టినప్పటికీ కూడా అవన్నీ తాత్కాలికంగానే మారుతున్నాయి. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా యూరియా పంపిణీ సక్రమ మార్గంలో కొనసాగడం లేదంటూ రైతాంగం భగ్గుమంటుంది.దీనికి ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న సంఘటనలే ఉదాహరణలు. కేంద్రాల వద్ద ఘర్షణలు,రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు,సంబంధిత కార్యాలయాల ముందు ఆందోళనలాంటివి ఇందులో కొన్ని అంశాలు.
ఇలాంటి పరిస్థితుల మధ్య తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం నుండి కేవలం తుంగతుర్తి మండలానికి చెందిన యూరియా పొందే రైతులు తమకు చెందిన ఒరిజినల్ భూమి పట్ట పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని నిబంధన పెట్టారు. ఈ లెక్కన వాటన్నింటిని రైతులు తీసుకొస్తూ క్యూ లో నిలబడ్డప్పటికీ బస్తాలు దొరకడం లేదు. ఇదిలా ఉంటే ఒకసారి యూరియా తీసుకున్న రైతు మళ్లీ మర్నాడే మిగతా వారి కన్నా ముందుగానే వస్తూ క్యూలో ఉంటూ యూరియాను పొందుతున్నారు. ఇక వివిధ ప్రాంతాల వారు కూడా సొసైటీకి యూరియా వచ్చిందనే విషయాన్ని ముందుగా పసిగడుతున్నారు. తమకు వ్యవసాయం లేకున్నప్పటికీ ఇతరులకు చెందిన పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డులు చూపిస్తూ యూరియాను పొందుతున్నారు.ఇవన్నీ ఇలా ఉంటే కొంతమంది పలుకుబడి వ్యక్తులు కూడా యదేచ్చగా యూరియా బస్తాలను తీసుకెళ్తున్నారు. ఇటీవలే ఓ పలుకుబడిన వ్యక్తి ఓవైపు వందలాదిమంది రైతులు క్యూలో ఉన్నప్పటికీ దర్జాగా కొన్ని యూరియా బస్తాలను తీసుకెళ్తుండగా రైతుల ఆగ్రహానికి గురయ్యారు. ఇక ప్రైవేటు ఫర్టిలైజర్స్ కూడా యూరియా పంపిణీని ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు. కొంతమంది తమకు చెందిన ఖాతాదారులకు మాత్రమే యూరియాకు అవసరం లేకున్నా ఇతర వాటిని అంటగడుతు అమ్ముకుంటున్నారని రైతులు బాహటంగానే విమర్శిస్తున్నారు.






