గాయ‌ప‌డ్డ వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నిడ‌మ‌నూరు : మండల పరిధి కోదాడ జడ్చర్ల 167 జాతీయ రహదారి పై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ డిగోడా జిల్లా కరోయి గ్రామానికి

గాయ‌ప‌డ్డ వ్య‌క్తి మృతి
X

దిశ‌, నిడ‌మ‌నూరు : మండల పరిధి కోదాడ జడ్చర్ల 167 జాతీయ రహదారి పై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ డిగోడా జిల్లా కరోయి గ్రామానికి చెందిన యస్వంత్ ఠాగూర్ (32) పెద్దవూర సమీపంలో విశ్వనాధ్ స్పిన్నింగ్ మిల్లులో దినసరి కూలిపని చేసుకుంటూ గురువారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండ‌గా.. వేంపాడ్ స్టేజి వద్ద హాలియా నుంచి మిర్యాలగూడ వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. గాయపడ్డ యశ్వంత్ ఠాగుర్ ను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తోటి కూలీలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు.

Next Story