కన్న కూతురినే అక్రమంగా విక్రయించిన తండ్రి..?

by Ratna Kumari |

క‌న్న కూతురినే అక్ర‌మంగా విక్ర‌యించాడు ఓ క‌సాయి తండ్రి. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కన్న కూతురినే అక్రమంగా విక్రయించిన  తండ్రి..?
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి : క‌న్న కూతురినే అక్ర‌మంగా విక్ర‌యించాడు ఓ క‌సాయి తండ్రి. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురు జీవం కోసం నవ మోసాలు మోసి ప్రసవం తర్వాత తల్లి మృతి చెందింది. దీంతో పసికందును తండ్రి ధనావత్ మధు సంరక్షణలోనే ఉండగా.. షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డబ్బుల ఆశతో శిశువును అక్రమంగా విక్రయించాడని పసికందు అమ్మమ్మ తాతయ్యల ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు మధ్యవర్తి గా బాలు పాత్రపై అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న పై గ‌తంలో బాలల సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే పసికందు ఎక్కడ అని ప్రశ్నించగా పాప చనిపోయింది అంటూ తండ్రి చెప్పడం గ‌మ‌నార్హం. దీంతో తండ్రి పై అనుమానం వచ్చి క‌లెక్ట‌ర్ కి ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ పాప నిజంగానే చ‌నిపోయిందా..? లేక అక్ర‌మంగా అమ్మేశారా..? అని జ‌న‌వ‌రి 27, 2026 న ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేయ‌డం న్యాయం ద‌క్క‌లేదు. న్యాయం కోసం మీడియాను ఆశ్ర‌యించారు కుటుంబ స‌భ్యులు. ఉన్న‌తాధికారులు వెంట‌నే స్పందించి న్యాయం చేయాల‌ని కోరుతున్నారు ఆ పాప అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌.

Next Story