ఉప సర్పంచ్ పవర్ ఫుల్.. పల్లె పాలనలో కీలక భూమిక

by Ajay Maddhiboyina |

పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవి పవర్ ఫుల్‌గా మారింది. నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు

ఉప సర్పంచ్ పవర్ ఫుల్.. పల్లె పాలనలో కీలక భూమిక
X

పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవి పవర్ ఫుల్‌గా మారింది. నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్ పవర్‌ను కట్టబెట్టారు. ఈ నిర్ణయంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొన్నది. అభ్యర్థులు గెలుపునకు ముందే ఉప సర్పంచ్ పదవి కోసం కండీషన్లు పెట్టుకుంటున్నారు. ఏకగ్రీవమైన చోట్ల కూడా సర్పంచ్ అధికార పక్షం వారికి ఇస్తే, ఉప సర్పంచ్ ప్రతిపక్షానికి ఇవ్వాలని షరతులు విధిస్తున్నారు. నిధుల నిర్వహణలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. అయితే, ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైనా, అక్రమ నిర్మాణాలకు అనుమతివ్వకపోయినా సర్పంచ్‌పైనే వేటు పడుతుంది. చెక్ పవర్ ఉన్నప్పటికీ చట్టపరమైన బాధ్యత ఎక్కువగా సర్పంచ్‌పై ఉండడం విశేషం.

- దిశ, కనగల్

దిశ, కనగల్ : పల్లె పాలనలో ఉప సర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. ఇంతకాలం నామం మాత్రంగా పాత్రకే పరిమితమైన ఉప సర్పంచ్ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం పవర్ ఫుల్‌గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచుతోపాటు ఉప సర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్ పవర్‌ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఉప సర్పంచ్ పదవిని బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొన్నది. అందుకే ఎన్నికలకు ముందు నుంచి తమ ప్యానల్ గెలిస్తే ఫలానా అభ్యర్థికి ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలనే కండీషన్లు సైతం పెట్టుకుంటున్నారు. ఏకగ్రీవమైన చోట్ల అధికార పక్షం వారికి సర్పంచ్ పదవి ఇస్తే ప్రతిపక్షానికి ఉప సర్పంచ్ ఇవ్వాలని షరతు విధించుకుంటున్నారు. ఏది ఏమైనా పంచాయతీలో ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారనుంది.

చెక్ పవర్ ఇద్దరికి బాధ్యత ఒక్కరిదే...

సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. నిధుల నిర్వహణ సర్పంచులకు ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైన సర్పంచ్‌లపై చర్యలు తీసుకునే అవకాశం 2018 పంచాయతీ రాజ్ చట్టానికి ఉంది. అయితే ఉప సర్పంచ్ సహ పాలకవర్గానికి ఇందులో భాగస్వాములను చేయలేదు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు జరిగిన, నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వకపోయినా సర్పంచ్‌పై వేటు పడుతుంది. ఈ విషయంలో ఉప సర్పంచ్‌కు మినహాయింపు ఉంది. అందుకే ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొన్నది.

Next Story