రైతులకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-04-10 13:53:40  IST  )

రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మోతె మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అన్నారు.

రైతులకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, మోతె: రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మోతె మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మద్ది మంజుల భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కీసర సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యానికి సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, ఆ ఘనత సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపయ్య, ఐకేపీ నిర్వాహకురాలు లత, గ్రామ కార్యదర్శి రేణుకతో పాటు గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

Next Story