- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు హాని కలిగించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు
ప్రజల సంక్షేమానికి వ్యతిరేకమైన ఏ పని నీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : ప్రజల సంక్షేమానికి వ్యతిరేకమైన ఏ పని నీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లోని డంపింగ్ యార్డ్ రద్దు చేయాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు గురువారం ఆయన తన పూర్తి మద్దతును ప్రకటించారు.
దీక్షకు సంఘీభావం - సమస్యపై హామీ..
గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలో పాల్గొన్న దీక్షా పరులతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఆయనను కలిసి, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో వారధిగా నిలవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలకు కలిగే ఆనారోగ్య, పర్యావరణ ఇబ్బందులను ఇప్పటికే సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ సమస్య తీవ్రతను వివరించేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి, డంపింగ్ యార్డ్ రద్దు దిశగా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన 2022లోనే (బిఆర్ఎస్ హయాంలో) వచ్చిందని.. అప్పుడే అప్పటి నాయకులు అడ్డుకుని ఉంటే నేడు ప్రజలకు ఈ దుస్థితి వచ్చేది కాదని విమర్శించారు. జనావాసాల మధ్య కాకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేని మారుమూల ప్రాంతాల్లో యార్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేయాలని, ప్రజలకు కీడు చేసే ఏ నిర్ణయాన్నైనా ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తానని వొడితల ప్రణవ్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని పాల్గొన్నారు.






