దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ఏఎన్ఎం పై చేయి చేసుకున్న సీహెచ్ఓ స‌స్పెండ్

by Ratna Kumari |   (  Updated:2025-12-24 12:24:01  IST  )

దిశ‌, చివ్వెంల : మ‌ద్యం మ‌త్తులో ఏఎన్ఎం పై సీహెచ్ఓ చేయి చేసుకున్నాడ‌ని దిశ వెబ్ సైట్ లో క‌థ‌నం ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ఏఎన్ఎం పై చేయి చేసుకున్న సీహెచ్ఓ స‌స్పెండ్
X

దిశ‌, చివ్వెంల : మ‌ద్యం మ‌త్తులో ఏఎన్ఎం పై సీహెచ్ఓ చేయి చేసుకున్నాడ‌ని దిశ వెబ్ సైట్ లో క‌థ‌నం ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌నానికి స్పందించిన‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్ట‌ర్ పెండెం వెంక‌ర‌మ‌ణ సీహెచ్ఓ ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేసిన‌ట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లు , గుంపుల తిరుమలగిరి ఉప కేంద్రంలో విధుల సమయంలో మద్యం సేవించి, మహిళ ఆరోగ్య కార్యకర్త, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం అందిన వెంట‌నే అత‌న్ని స‌స్పెండ్ చేసిన‌ట్టు జిల్లా వైద్యాధికారి పెండెం వెంక‌ట‌ర‌మ‌ణ తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలలో పనిచేసి ఉద్యోగులు విధుల సమయంలో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని డీఎంహెచ్ ఓ పెండెం వెంకటరమణ స్పష్టం చేశారు. ఇలాంటి అనుచిత ప్రవర్తన పట్ల శాఖ ఎలాంటి సహనాన్ని ప్రదర్శించదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టనున్నట్లు, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ తెలిపారు.

Next Story