వాగులో దూకిన దగ్గరే మృతదేహం...

by Nalla Sampath Reddy |   (  Updated:2025-08-30 03:10:11  IST  )

గురువారం సాయంత్రం పాలేరు వాగులో గల్లంతైన గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ ఆచూకీ దొరికింది

వాగులో దూకిన దగ్గరే మృతదేహం...
X

దిశ, అనంతగిరి: గురువారం సాయంత్రం పాలేరు వాగులో గల్లంతైన గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ ఆచూకీ దొరికింది. వరద ఉధృతి తగ్గుతూ ఉండడంతో వాగులో దూకిన కొద్ది దూరంలోనే మృతదేహం పైకి తేలింది. తుంగలో మృతదేహం ఇరుక్కుపోయిందని అందుకే రెండు రోజుల సమయం పట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఉపేందర్ ఆచూకీ కోసం అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. గత రాత్రి వరకు చర్యలు చేపట్టిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం కూడా చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గొండ్రియాల గ్రామ శివారులోని మృతదేహం దొరకడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఉపేందర్ మృతదేహం చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story