విద్యుత్ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం..

by I. Sairam |

మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ శాఖలో సుమారు రూ.23.63 లక్షల విలువైన 9 అభివృద్ధి పనుల టెండర్లలో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి.

విద్యుత్ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం..
X

మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ శాఖలో సుమారు రూ. 23.63 లక్షల విలువైన 9 అభివృద్ధి పనుల టెండర్లలో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ రోస్టర్ విధానాన్ని విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా 'స్థానికులకే అవకాశం' అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చి, తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకు అధికారులు కుట్ర పన్నారని తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా, మరోసారి ముడుపుల కోసం రిజర్వేషన్లకు పాతర వేయడం గమనార్హం. పారదర్శకత లేకుండా జరుగుతున్న ఈ టెండర్ ప్రక్రియపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానిక కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

దిశ బ్యూరో, నల్లగొండ: మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ శాఖలో సుమారు రూ.23.63 లక్షల విలువైన 9 అభివృద్ధి పనుల టెండర్లలో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ రోస్టర్ విధానాన్ని విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిర్యాలగూడ డివిజన్ లో విద్యుత్ శాఖలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగానే 9 పనులకు రూ.23.63లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ పనులు చేపట్టేందుకు జనవరి 12న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు అర్హత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 4గంటలకు అధికారులు కాంట్రాక్టర్ల సమక్షంలో టెండర్ దరఖాస్తులను ఓపెన్ చేస్తారు. అతి తక్కువ టెండర్ కోడ్ చేసిన వారికి విద్యుత్ పనులను అప్పగిస్తారు. అయితే సమ్మర్‌లో ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే క్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అయితే టెండర్‌లో పాల్గొని కాంట్రాక్టర్లు స్థానికులై ఉండాలని సంబంధిత శాఖ అధికారులు నిబంధన పెట్టారు. అంతేకాకుండా టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 90 రోజులలో పనులు చేయడానికి గడువు విధించారు.

రోస్టర్ విధానమేదీ..?

విద్యుత్ శాఖలో చేపట్టే అభివృద్ధి పనుల టెండర్లకు ఖచ్చితంగా రోస్టర్ విధానం పాటించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ప్రస్తుతం టెండర్లు స్వీకరించనున్న 9 పనులలో రోస్టర్ ప్రకారం మూడింటిని ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలి. అందులో సీరియల్ నెంబర్ 32/25-26లో రూ.2,65,673 విలువగల పని, మరొకటి సీరియస్ నెంబర్ 37/25-26లో రూ.5,57,333 విలువతో కూడిన పనులను రోస్టర్ ప్రకారం ఎస్సీలకు కేటాయించాలి. కానీ అధికారుల టెండర్ నోటిఫికేషన్‌లో ఎలాంటి రోస్టర్ విధానం కనిపించట్లేదు. ఎస్టీలకు మాత్రమే రోస్టర్ విధానం అమలు చేస్తున్నారని తెలిసింది.

విద్యుత్ శాఖలో నిబంధనలకు పాతర..?

విద్యుత్ శాఖలో ఎక్కడ లేని కొత్త నిబంధనలో కేవలం మిర్యాలగూడ ఇవ్వాలని అధికారులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లు ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం నేడు 9 పనులకు జరిగే టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనాలంటే స్థానికులై ఉండాలని నిబంధన విధించారు. అంటే స్థానికులు అంటే మిర్యాలగూడ నియోజకవర్గమా.. రెవెన్యూ డివిజనా.. లేదా నల్గొండ జిల్లా వరకు లోకల్‌కు సంబంధించిన కాంట్రాక్టర్లా అనే విషయాన్ని స్పష్టం చేయకపోవడం విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవంగా ఇలాంటి నిబంధన ఏ డివిజన్‌, జిల్లాలోనూ లేదు. కేవలం ఆ డివిజన్ అధికారులు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులను అప్పగించేందుకు మాత్రమే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు పాల్గొనకుండా కుట్రకు తెరలెపినట్లు బోగట్టా.

ఎప్పుడూ అక్రమ దారిలోనే..?

మిర్యాలగూడ డివిజన్ లో విద్యుత్ శాఖ అధికారులు ఎప్పుడూ అక్రమ దారిలో పయనిస్తారనే విమర్శలున్నాయి. గత నవంబర్ చివరి వారంలో కూడా దాదాపు రూ.40లక్షల పనులకు టెండర్ వేసినట్లు నవంబర్ 19న ప్రకటించారు. కానీ 25వరకు ఆన్ లైన్‌లో నమోదు చేయలేదు. ఆ సమయంలో కూడా తన వాళ్లకి పనులు దక్కేందుకు కుట్ర పన్నినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఆ దారిలోనే ఈసారి కూడా తమకు ముడుపులు అప్పగించే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడానికి ‘స్థానికులకే ప్రాధాన్యత’ అనే నిబంధనలు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకే స్థానికులై ఉండాలని భావిస్తే ఉద్యోగులకు మాత్రం ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉండొచ్చా? అంటూ కొత్త చర్చకు తెరలేసింది. ఇలా ప్రతిసారి జరుగుతున్న టెండర్లలో నిబంధనలకు సంబంధం లేకుండా పనులు అప్పగించడంలో ఆ డివిజన్ అధికారులు ఆరితేరినట్లు సమాచారం.

Next Story