- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడలో ఉద్రిక్తత.. మృతదేహంతో నిరసన
దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ గాంధీనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నెల 15న హుజూర్ నగర్ సబ్ జైలులో అస్వస్థతకు

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ గాంధీనగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నెల 15న హుజూర్ నగర్ సబ్ జైలులో అస్వస్థతకు గురై మృతి చెందిన కర్ల రాజేష్ మృత దేహంతో కుటుంబ సభ్యులు, ధర్మసమాజ్ పార్టీ నేతలు నినాదాలతో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించడతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టౌన్ సీఐ శివశంకర్ నాయక్ నేతృత్వంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పోలీసులు-బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేపట్టేది లేదని నిరసనకారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






