- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత అప్పన్నపేట ఆలయంలో ...వెండి కిరీటం, హుండీ నగదు మాయం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పాత అప్పన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది.

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పాత అప్పన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దొంగలు దేవాలయం తాళం పగులగొట్టి లోపల ప్రవేశించి, స్వామివారి 15 తులాల వెండి కిరీటంతో పాటు, హుండీ తాళం పగలగొట్టి అందులోని నగదు అపహరించారు. ఆలయ పూజారి నరసింహ చార్యులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఆలయం ఎదురుగా ఉన్న బోరు పంపు నుండి మంచి నీళ్లను తీసుకునేందుకు వచ్చిన సమయంలో తాళం పగిలి ఉండటం గమనించారు. వెంటనే పూజారికి సమాచారం అందించగా, ఆలయానికి వచ్చి పరిశీలించిన పూజారి, వెండి కిరీటం, హుండీ నగదు మాయం అయినట్లు గుర్తించారు. దీంతో హుజూర్నగర్ సీఐ చరమంద రాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, గరిడేపల్లి ఎస్సై నరేష్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూజారి ప్రకారం, మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆలయాన్ని సందర్శించిన సమయంలో తాళం సురక్షితంగా ఉండగా, తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






