కేజీబీవీ మెను పై త‌హ‌శీల్దార్ విచారణ

by Ratna Kumari |

మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మెనూ పై జరుగుతున్న ప్రచారంలో భాగంగా బుధవారం మర్రిగూడ త‌హ‌శీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ విచారణ నిర్వహించారు.

కేజీబీవీ మెను పై త‌హ‌శీల్దార్ విచారణ
X

దిశ, మర్రిగూడ : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మెనూ పై జరుగుతున్న ప్రచారంలో భాగంగా బుధవారం మర్రిగూడ త‌హ‌శీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త‌హ‌శీల్దార్ కేజీబీవీలో బాలికలతో పాటు ప్రత్యేక అధికారి, సిబ్బంది పై విడివిడిగా విచారణ నిర్వహించారు. అనంతరం వండిన అన్నం, కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా త‌హ‌శీల్దార్ దిశతో మాట్లాడారు. విచారణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, విద్యార్థులను విడివిడిగా మాట్లాడిన తర్వాత జరిగిన విచారణ కాపీని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు. కేజీబీవీ పై తప్పుడు కథనాలు ప్రచురించిన విలేకరి పై కేజీబీవీ ప్రత్యేక అధికారి జ్యోతి మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. కేజీబీవీలోకి రాకుండా రిపోర్ట‌ర్ తప్పుడు వార్త కథనాలు ప్రచురించి తన మనోభావాలను దెబ్బతీశాడ‌ని.. అత‌నిపై కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story