- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళ్లూరి వెంకన్న అకాల మరణం జర్నలిజం రంగానికి తీరని లోటు
దిశ, శాలిగౌరారం : శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ దినపత్రిక విలేఖరి తాళ్లూరి వెంకన్న గత కొన్ని సంవత్సరాలుగా

దిశ, శాలిగౌరారం : శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ దినపత్రిక విలేఖరి తాళ్లూరి వెంకన్న గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ లోని పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ వెంకన్న చిత్రపటానికి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వెంకన్న కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరనిలోటని, వెంకన్న కుటుంబాన్ని భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నోముల జనార్ధన్, బాకీ వెంకన్న, చెవుగోని శంకర్, చిల్లం శెట్టి,శ్రీను,నోముల శంకర్, యంగలి గోపి, ఆలేటి నరేష్, గండమళ్ళ నగేష్, యల్మకంటి హరీష్, గణేష్, కొడిమాల శంకర్, బండారు శేఖర్ పాల్గొన్నారు.






