- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ సరిపోవట్లే.. రోజురోజుకి పెరుగుతున్న ఫిర్యాదులు
సూర్యాపేట పట్టణంలో సమస్యలు పెరగడంతో బాధితులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు.

దిశ,సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో సమస్యలు పెరగడంతో బాధితులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో రోజురోజుకి ఫిర్యాదులు పెరగడంతో బాధితులు స్టేషన్ కి ఎక్కువ మొత్తంలో రావడంతో పోలీస్ స్టేషన్ సరిపోవట్లేదని స్టేషన్ కు వచ్చే బాధితులు వాపోతున్నారు. వన్ టౌన్,టూ టౌన్ పోలీస్ స్టేషన్ లు ఓకే పోలీస్ స్టేషన్ లో ఉండడంతో ఫిర్యాదు చేసిన బాధితులతో మాట్లాడడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ భవనాన్ని 1-11-2007 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ, జైళ్ల , ఫైర్ సర్వీసెస్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి, ఐటీ, క్రీడా ల యువజన సర్వీసుల శాఖ మంత్రి రాoరెడ్డి దామోదర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆకారపు సుదర్శన్,అప్పటి సూర్యాపేట శాసనసభ్యులు వేదాస్ వెంకయ్య కలిసి ప్రారంభించారు.
అప్పటినుండి విధుల్లో చేరిన ఎస్సైలు, సీఐలు ఈ స్టేషన్ నుండి బాధితులకు సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సూర్యాపేట జిల్లా ఏర్పడడంతో సూర్యాపేట పట్టణం 48 వార్డులు గా విస్తరించింది. దీంతో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లు గా వేరు చేశారు. ఇద్దరు ఎస్సైలు విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ కాస్త నలుగురు ఎస్సైలు అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించాల్సి వచ్చింది. రోజురోజుకి పట్టణంలో ఫిర్యాదులు ఎక్కువ అవడంతో బాధితుల సంఖ్య పెరగడంతో ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఇరుకుగా ఉండడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాలను వేరుగా చేసి బాధితులకు సేవలందించాలని సూర్యాపేట పట్టణ ప్రజలు కోరుతున్నారు.






