- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శభాష్ సర్.. వరదలో చిక్కుకున్న విద్యార్థినీలను తన కారులో గమ్యానికి చేర్చిన కలెక్టర్ (వీడియో)
సూర్యాపేట జిల్లా కలెక్టర్ చేసిన పనికి అంతా ఔరా అంటున్నారు. ఇలాంటి కలెక్టర్ కూడా ఉంటారా అంటూ చర్చించుకుంటున్నారు.

దిశ, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా కలెక్టర్ చేసిన పనికి అంతా ఔరా అంటున్నారు. ఇలాంటి కలెక్టర్ కూడా ఉంటారా అంటూ చర్చించుకుంటున్నారు. వర్షంలోనూ ఊరూవాడ తిరుగుతూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్న కలెక్టర్.. వరదలో చిక్కుకున్న విద్యార్థులను తన కారులో సురక్షితంగా గమ్యానికి చేర్చారు. సూర్యాపేట (Suryapet) జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ (Collector Tejas Nand Lal Pawar) చేసిన ఈ మంచిపని నెట్టంట వైరల్‌గా మారింది.
సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కృష్ణపట్టే ప్రాంతాలను పరిశీలించేందుకు అధికారులతో కలిసి వెళ్లారు. అయితే రఘునాథపాలెం గ్రామానికి చెందిన విద్యార్థినీలు మఠంపల్లి మోడల్ స్కూల్ నుంచి తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. మఠంపల్లి శివారులోని కప్పలకుంట వాగు ఉధృతంగా మారి బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.
అప్పుడే అటువైపుగా వచ్చిన కలెక్టర్ వారి సమస్యను తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రయాణం సురక్షితం కాదని గుర్తించి తన కారులోనే ఆ విద్యార్థినీలను తీసుకెళ్లి మోడల్ స్కూల్లో డ్రాప్ చేశారు. వరద తగ్గేవరకు విద్యార్థుల్ని ఇక్కడే ఉంచాలని, ఆ తర్వాత వారి ఇండ్లకు చేర్చాలని అధికారులు ఆదేశించారు. అలాగే విద్యార్థినీలకు భోజన సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ తన వాహనంలో విద్యార్థులను తీసుకొచ్చిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడంతో జిల్లా ప్రజలు కలెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శభాష్.. కలెక్టర్ సర్ అంటూ అభినందిస్తున్నారు. కలెక్టర్ వెంట హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, మఠంపల్లి తహసీల్దార్ మంగ ఉన్నారు.






