- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాగృతి సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్ గా సూరారపు కృష్ణవేణి
తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్య క్షు రాలు కల్వకుంట్ల కవిత గురువారం కృణవేణి ని జిల్లా అధ్యక్షురాలు గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో అనుబంధ సంఘాలతో పాటు పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను కవిత ప్రకటించారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ కు చెందిన సూరారపు కృష్ణవేణి జాగృతి నూతన అధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు,
కవితక్కకు కృతజ్ఞతలు
తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్ గా తనకు అవకాశం కల్పించిన జాగృతి వ్యవస్థాపక అధ్య క్షు రాలు కల్వకుంట్ల కవితకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని జిల్లా ప్రెసిడెంట్ కృష్ణ వేణి తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యల పై రాజీ లేని పోరాటం చేస్తామని తనపై ఉంచిన నమ్మ కంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.






