ప్ర‌తి ధాన్యం గింజ‌కు మ‌ద్ద‌తు ధ‌ర : ఎమ్మెల్యే బాలు నాయ‌క్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, చందంపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రైతు భరోసా కింద ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని

ప్ర‌తి ధాన్యం గింజ‌కు మ‌ద్ద‌తు ధ‌ర : ఎమ్మెల్యే బాలు నాయ‌క్
X

దిశ‌, చందంపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రైతు భరోసా కింద ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ తెలిపారు. మంగ‌ళ‌వారం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రైతులు తమ ఉత్పత్తిని సకాలంలో తీసుకొచ్చి అమ్ముకోవచ్చని తెలిపారు. డబ్బులు 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతాయ‌ని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని పీఏసీఎస్ కేంద్రాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మొత్తం పీఏసీఎస్ కేంద్రాల ద్వారా రైతులకు సౌకర్యవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆధునిక తేమ కొలిచే యంత్రాలు, బరువును కొలిచే యంత్రాలు, తడి తొలగింపు సౌకర్యంతో పాటు, రైతులకు విశ్రాంతి తీసుకునే విధంగా మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.

Next Story