- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సుమలత
కనగల్లు మండల పరిషత్ ఇంచార్జ్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కుంభం సుమలత బాధ్యతలు స్వీకరించారు.

దిశ, కనగల్లు: కనగల్లు మండల పరిషత్ ఇంచార్జ్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కుంభం సుమలత బాధ్యతలు స్వీకరించారు. సుమలత కనగల్లు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెను ఘన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సహకరించాలని అన్నారు. ఇప్పటివరకు ఎంపీడీవోగా విధులు నిర్వహించిన తులసి జయరాం వికారాబాద్ జిల్లాకు ఎంపీడీవోగా బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ అండాలు,ఏపీఓ సుధాకర్, కాశిం, రాజేందర్ రెడ్డి, కందుల వెంకన్న, సందీప్,వెంకటరమణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






