10 తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

by S Gopi |

మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో శనివారం పదవతరగతి.... study materials Distribution to class 10 students

10 తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
X

దిశ, నాగార్జునసాగర్: మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో శనివారం పదవతరగతి విద్యార్థులకు ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో పుస్తకాలను ఎస్ఐ పరమేష పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిచడం అభినందనీయమని అన్నారు. దాతలు ఇంకా ముందుకు వచ్చి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి శ్రీనివాస్, ఇంచార్జి ప్రదానోపాధ్యాయులు శైలజ, ప్రజా నాట్యమండలి సెక్రటరీ పాండు రంగారావు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story