రేపటి సమాజాన్ని మార్చేది విద్యార్థులే : ఎస్పీ శరత్ చంద్ర పవార్

by Nallavelli.Anjaneyulu |

రేపటి సమాజాన్ని మార్చేది విద్యార్థులేన‌ని న‌ల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.

రేపటి సమాజాన్ని మార్చేది విద్యార్థులే : ఎస్పీ శరత్ చంద్ర పవార్
X

దిశ, నల్లగొండ క్రైం : రేపటి సమాజాన్ని మార్చేది విద్యార్థులేన‌ని న‌ల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. నల్లగొండ మండలంలోని దోమలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పీఆర్ఆర్ ఫౌండేష‌న్ రూపొందించబడిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ఆయ‌న‌ ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పుస్తకం చేతిలో ఉన్న విద్యార్థులే రేపటి సమాజాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని అన్నారు. ప్రతిభకు గుర్తింపు లభించినప్పుడే విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల దృఢ సంకల్పం తప్పనిసరి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇష్టంతో చదివి పక్కతలతో మంచి ఫలితాలు సాధించాలని మన గమ్యం చేరాలంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చలం పాండురంగారావు ను ఎస్పీ అభినందించారు. అదేవిధంగా చదువుపై తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విద్యపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శివరాం రెడ్డి, రూరల్ ఎస్సై సైదా బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కొమ్ము శ్రీనివాస్ విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Next Story