ఆసుపత్రిలో వీధి కుక్కలు..భయాందోళనలో పేషెంట్లు

by Naveena |   (  Updated:2024-12-08 12:52:09  IST  )

మర్రిగూడ మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి .

ఆసుపత్రిలో వీధి కుక్కలు..భయాందోళనలో పేషెంట్లు
X

దిశ,మర్రిగూడ: మర్రిగూడ మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి . శనివారం ఒక్కరోజే ముగ్గురిపై కుక్కలు దాడి చేయడంతో.. వారికి తీవ్ర గాయాలయ్యాయి . దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో కుక్కలు విచ్చలవిడిగా ఉండడం అక్కడ సిబ్బంది వాటిని పట్టించుకోకపోవడంతో పేషంట్ల పైన కుక్కలు దాడులు చేస్తున్నారు. మండల కేంద్రంలో ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వైద్యం కోసం మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రికి వైద్యం కోసం వస్తూ ఉంటారు. కొత్త బస్టాండ్ లో బస్సు దిగి కిలోమీటర్ దూరంలో ఉన్న ఆసుపత్రికి నడిచి వెళ్లేటప్పుడు కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ లో రోడ్లపైనే 20 ,30 కుక్కలు ఒకే దగ్గర ఉండి..అటు పాదా చారులు, ఇటు ద్విచక్ర వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇళ్లల్లో ఉన్న వారిని, చిన్న పిల్లలపై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి లో వైద్యం చేయించడానికి వెళ్లగా..కుక్కలు దాడి చేశాయి. దీంతో పల్లె మల్లేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్లిన ఈ యాచారం పెద్దయ్యపై కుక్కలు దాడి చేయడంతో.. కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం వచ్చే పేషంట్లపై కుక్కలా దాడుల విషయమై డాక్టర్ ను సంప్రదించగా.. తాము కుక్కలను సాదటం లేదని, బయట నుంచి కుక్కలు వచ్చి పేషంట్లపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. అధికారులు కుక్కల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story