- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట జిల్లాకు విడుదలైన శ్రీ ఆర్డీఆర్ ఎస్సారెస్పీ జలాలు
ఎస్సారెస్పీ కాల్వ నుంచి సూర్యాపేట జిల్లాకు సాగునీటిని అధికారులు వదిలారు. వరిపొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో మరోసారి నీటిని విడుదల చేశారు.

దిశ, తుంగతుర్తి: రైతుల విజ్ఞప్తి, వివిధ పార్టీల ఆందోళనల ఫలితంగా సూర్యాపేట జిల్లాకు శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ రెండవ దశ (శ్రీ ఆర్డీఆర్ ఎస్సారెస్పీ) జలాలను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అధికారులు గేట్లను ఎత్తి తొలుతగా 862 క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే శనివారం నుండి నీళ్ల సామర్ధ్యాన్ని అధికారులు మరింత పెంచానున్నారు. ఈ మేరకు తుంగతుర్తి నియోజకవర్గం వెలిశాల ప్రాంతం వద్ద సూర్యాపేట జిల్లాలోకి నీళ్లు ప్రవేశించినప్పటికీ అక్కడే ఉన్న 69 డిస్ట్రిబ్యూటర్, మామిడిపల్లి వద్ద ఉన్న 70, ప్రగతినగర్ వద్ద ఉన్న 71 డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లు చేరి అక్కడి నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి కొంత సమయం పట్టనుంది.
ముఖ్యంగా బయన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.480 క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 0.451 టీఎంసీలు మాత్రమే ఉంది. కాగా వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం ప్రాంతం వద్ద ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 2002 క్యూసెక్కుల నీళ్లను అక్కడి అధికారులు సాయంత్రం వేళలో బయన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి వదిలిపెట్టారు.
ఇది ఇలా ఉంటే ఈ ఏడాది జనవరి 7 నుండి వారబంది పద్ధతిలో మార్చి 30 వరకు అధికారులు ఇప్పటికే ఆరు విడుదలగా 6.88 టీఎంసీల నీళ్లను జిల్లాకు వదిలారు. మరో వారం పాటు నీళ్లను వదలనున్నారు. కాగా వస్తున్న జలాలను రైతులు వృథా చేయకుండా సక్రమంగా వాడుకోవాలని తిరుమలగిరి డివిజన్ నీటిపారుదల శాఖ 2 ఈఈ ఎం.సత్యనారాయణ, రిజర్వాయర్ ఏఈఈ చంద్రశేఖర్ లు విజ్ఞప్తి చేశారు.
మా పోరాట ఫలితమే నీటి విడుదల: బీఆర్ఎస్
తాము చేపట్టిన పోరాటాల ఫలితంగానే సూర్యాపేట జిల్లాకు ఏడవ విడతగా నీటి విడుదల జరిగిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.






