- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగికి తీవ్ర గాయాలు.. డ్యూటీ కి వెళ్లి వస్తుండగా ప్రమాదం..

X
దిశ, నేరేడుచర్ల / పాలకవీడు : రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగికి తీవ్ర గాయాలను సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాన్ పహాడ్ గ్రామానికి చెందిన షేక్ సైదా జాన్ పహాడ్ దుర్గా ప్రాంతంలో లైన్మెన్ కింద కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు ఆర్టీజియన్ గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా బిల్లులు వసూలు చేసిన వాటిని పాలకవీడు వెళ్లి కట్టి తిరిగి జాన్ పహాడ్ వెళ్తున్నాడు.
అయితే.. ఈ సమయంలోనే నేరేడుచర్ల - జాన్ పహాడ్ రహదారిపై పాలకవీడు మండలంలోని బేట్టెగూడెం వద్ద గేదె అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం కావడంతో మిర్యాలగూడ హాస్పిటల్ లో తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోనే యశోద హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.
Next Story






