- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగడి కుర్మపల్లిలో వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
అంగడి కుర్మపల్లిలో వెలసిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణానికి ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 15 స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్. విద్యాధర్ తెలిపారు.

దిశ, చింతపల్లి : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లి గ్రామంలో వెలసిన శ్రీ జగజ్జనని కాళికా మహాదేవి సహిత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లోక కల్యాణార్థం జరిగే ఈ దివ్య కళ్యాణాన్ని భక్తులందరూ కనులారా తిలకించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది. విరాట్ పదవిఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం.. కాలజ్ఞాన ప్రకారం వీరబ్రహ్మ గురుం భజే అంటూ భక్తులు స్వామివారి నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్. విద్యాధర్ కోరారు.






