పోలింగ్ కేంద్రాల‌పై ఎస్పీ ప్ర‌త్యేక నిఘా

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కోదాడ : సూర్య‌పేట జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో

పోలింగ్ కేంద్రాల‌పై ఎస్పీ ప్ర‌త్యేక నిఘా
X

దిశ‌, కోదాడ : సూర్య‌పేట జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం ఆయన కోదాడ మండల పరిధిలోని గణపవరం, బిక్య తండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తుల నుంచి ఐదు లక్షల రూపాయలకు బైండోవర్ చేయించినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం గ్రామపంచాయతీ సిబ్బంది, ఎన్నికల సిబ్బందితో పాటు సుమారు 1500 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందని, శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Next Story