మీడియా రంగంలో 'దిశ' పత్రికకు ప్రత్యేక గుర్తింపు : క‌లెక్ట‌ర్ బ‌డుగు చంద్ర‌శేఖ‌ర్

by Nallavelli.Anjaneyulu |

మారుతున్న కాలంలో మీడియా రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.

మీడియా రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక గుర్తింపు :  క‌లెక్ట‌ర్ బ‌డుగు చంద్ర‌శేఖ‌ర్
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : మారుతున్న కాలంలో మీడియా రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. దిశ దినపత్రిక 2026 క్యాలెండర్ ను వారు వారి కార్యాలయాలలో శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు కావలసిన వసతులను, సౌకర్యాలను, పథకాలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తూ ప్రజలను అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా వార్తలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉపయోగపడే విధంగా పత్రికలు సేకరించే వార్తలు ఉండాలన్నారు. అదేవిధంగా నల్లగొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస నేత కూడా దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దిశ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో ఇంచార్జ్ గాదె రమేష్, టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్, డిపిఆర్ఓ యూ. వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, ఉమ్మడి జిల్లా యాడ్స్ ఇన్ చార్జి రాగి సైదులు, రిపోర్టర్లు ఉబ్బని సైదులు, జానీ బాయ్, టీ. నాగయ్య ఉన్నారు.

Next Story