కదిలిన ఎస్వీ కాలేజీ స్టూడెంట్స్.. వారం రోజులు ప్రత్యేక శిబిరాలు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-09 08:49:58  IST  )

సూర్యాపేట జిల్లా ఏనుభాముల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం అయింది. ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

కదిలిన ఎస్వీ కాలేజీ స్టూడెంట్స్.. వారం రోజులు ప్రత్యేక శిబిరాలు
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా ఏనుభాముల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం అయింది. ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా సమితి వారి ఆర్థిక సహాయంతో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నుండి జాతీయ సేవా సమితి యూనిట్-1, జాతీయ సేవా సమితి యూనిట్-2 విద్యార్థులు అక్టోబర్ 14 వరకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక శిబిరంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అమ్మని, ఉపాధ్యాయులను, ప్రకృతిని జీవితంలో మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. అలాగే ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు.

రెండో రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం

శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ రెండు యూనిట్లు ఏనుభాముల గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ముత్యాలమ్మ గుడి రోడ్డులోని చెత్తను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తొలగించారు. అదేవిధంగా బొడ్రాయి బజార్ లోని వీధులను శుభ్రం చేశారు. అనంతరం గ్రామంలోని చెత్తను వీధి చివరలో వేయకుండా మున్సిపాలిటీ చెత్త ట్రక్‌కు ఇవ్వవలసిందిగా ఎన్ఎస్ఎస్ వాలెంటైర్సు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. మధుసూదన్, ఎన్ఎస్ఎస్ యూనిట్- 2 ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్. సృజన, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ శ్రీవల్లి, మధు, కోమల్, భాను, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story