విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి : ఎంపీడీవో హుస్సెన్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కోదాడ : విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోదాడ ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్ అన్నారు.

విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి :  ఎంపీడీవో హుస్సెన్
X

దిశ‌, కోదాడ : విద్యార్థుల భోజనంపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోదాడ ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్ అన్నారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని దొరకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూ అమలు, శుభ్రత అంశాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించిన ఎంపీడీవో, వంట సామగ్రి నిల్వలు, వంట ప్రక్రియ, పాత్రల శుభ్రతపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి, పరిమాణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనం అందించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వంటగదిలో శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల పోషణకు కీలకమని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్ స్పష్టం చేశారు.

Next Story