- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసుల దాడి
by velandi.Saikiran |
పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామ

X
దిశ, భూదాన్ పోచంపల్లి: పేకాట స్థావరంపై ఎస్వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామ శివారులో గల ఓ వెంచర్లో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్పూర్ గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కేంద్రానికి చెందిన పాలకూర్ల జంగయ్య, చెక్క నరేష్, సామల సుధాకర్ రెడ్డి, కంది మహేందర్, పాలకుర్ల ఉపేందర్, ప్రశాంత్ లు గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో భువనగిరి ఎస్ఓటి పోలీసులు మెరుపు దాడి చేశారు. వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్లు, 4 పేకాట సెట్లు, 25,570 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.
- Tags
- SOT police
- poker
Next Story






