చింత‌ల‌పాలెం నూత‌న త‌హ‌శీల్దార్ గా సోమ‌పొంగు సూర‌య్య

by Nallavelli.Anjaneyulu |

చింతలపాలెం మండలానికి నూతన త‌హ‌శీల్దార్ గా సోమపొంగు సూరయ్య గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

చింత‌ల‌పాలెం నూత‌న త‌హ‌శీల్దార్ గా సోమ‌పొంగు సూర‌య్య
X

దిశ, చింతలపాలెం : చింతలపాలెం మండలానికి నూతన త‌హ‌శీల్దార్ గా సోమపొంగు సూరయ్య గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కోదాడ తహ‌శీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల జరిగిన పదోన్నతులలో భాగంగా ప్రమోషన్‌పై చింతలపాలెం మండల తహశీల్దార్ గా బదిలీ అయ్యారు. పదవీ స్వీకరణ అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమై, మండలంలో జరుగుతున్న రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ధరణి సమస్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఇప్పటివరకు చింతలపాలెం తహ‌శీల్దార్ గా విధులు నిర్వహించిన సురేందర్ రెడ్డి ని హుజూర్ న‌గ‌ర్ ఆర్డీఓ కార్యాలయానికి తహసిల్దారుగా బదిలీ చేశారు. ఆయన చింతలపాలెంలో పనిచేసిన కాలంలో ప్రజలకు అందించిన సేవలను స్థానికులు గుర్తు చేస్తున్నారు. నూతన తహ‌శీల్దార్ సోమపొంగు సూరయ్య పదవీ బాధ్యతలు స్వీకరించడంతో మండల ప్రజలు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమర్థవంతమైన పాలన అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Next Story