యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై భాస్కర్ రెడ్డి

by Bhanu |

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై భాస్కర్ రెడ్డి సూచించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణపై ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాంటీ డ్రగ్స్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై భాస్కర్ రెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై భాస్కర్ రెడ్డి సూచించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణపై ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాంటీ డ్రగ్స్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్ సేవించే వారికి దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్లో అనవసరమైన లింక్ లను ఓపెన్ చేసి చిక్కులో పడకూడదన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 1930 లేదా డెయిల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, రాజశేఖర్, లలిత, అంకిత, స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జ్యోతి, తులసి, శివశంకర్ , వెంకట్ రెడ్డి, రేణుకా దేవి, స్వాతి, జీవి రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story