- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొరిపిరాల ఆత్మహత్య కేసులో ఏడుగురు రిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామంలో సంభవించిన విషాద ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.

X
దిశ, ఆత్మకూరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామంలో సంభవించిన విషాద ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 18న మొరిపిరాల గ్రామానికి చెందిన యువతి కటిక సంధ్య మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపగా, కేసును విచారించిన పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడిన ఏసీపీ పి. మధు సూదన్ రెడ్డి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సంధ్య ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను గుర్తించి, విచారణ అనంతరం వారిని న్యాయస్థానానికి హాజరుపర్చి రిమాండ్‌కు పంపించినట్టు తెలిపారు. రిమాండ్ చేసిన వారిలో సంధ్య భర్త కటిక కృష్ణ, తల్లి మారెమ్మ, తండ్రి రాములుతో పాటు శివగణేశ్, శ్రీను, రమ్య, వాణి ఉన్నట్లు చెప్పారు.
Next Story






