- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక స్పృహతో సేవ చేయడం అభినందనీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సామాజిక స్పృహతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : సామాజిక స్పృహతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆర్కే హాస్పిటల్, కామినేని హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో "పల్లె పల్లెకి వైద్యం" కార్యక్రమంలో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు (మున్సిపల్ సిబ్బందికి) వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదని.. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలు చేయాలన్నారు. మా తల్లి గారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. చావా ఫౌండేషన్‌కి మా ఫౌండేషన్ తరపున, ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. శాసనసభ్యుడిగా కాకుండా ఒక స్నేహితుడి లాగా, వ్యక్తిగా సహాయం చేస్తానని చెప్పారు. పదవి అనేది శాశ్వతం కాదని.. మన వ్యక్తిత్వం... సేవ చేయాలనే గుణం శాశ్వతం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఆర్డివో వెల్మ శేఖర్ రెడ్డి తహశీల్దార్ వీరాబాయి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






