- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
by Kema Shiva Kumar |
చెరువులోకి స్కూల్ బస్సు దూసుకెళ్లిన ఘటన సూర్యపేట (Suryapet) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: చెరువులోకి స్కూల్ బస్సు దూసుకెళ్లిన ఘటన సూర్యపేట (Suryapet) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మునగాల (Munagala) మండల పరిధిలోని నేలమర్రి (Nelamarri) నుంచి 15 మంది విద్యార్థులతో స్కూల్ బస్సు వల్లభాపురంలోని సెయింట్ పోల్స్ పాఠశాలకు బయలుదేరింది. అయితే, బస్సు నేలమర్రి చెరువు కట్టపైకి రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే చెరువు కట్ట అంచున ఓ భారీ వృక్షం బస్సుకు అడ్డుపడటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో బస్సులోని విద్యార్థులతో పాటు డ్రైవర్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అడ్డగోలుగా బస్సు నడిపిన డ్రైవర్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. వెంటనే డ్రైవర్‌ను ఉద్యోగం తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
Next Story






