- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతను సర్పంచ్.. మరోవైపు డాక్టర్..!
సాధారణంగా ఒక వ్యక్తి రెండు బాధ్యతలు నిర్వహించడం చాలా అరుదు అని చెప్పవచ్చు. ఇక్కడ ఓ వ్యక్తి సర్పంచ్ గా విధులు నిర్వర్తించడంతో పాటు డాక్టర్ గా కూడా కొనసాగుతున్నారు.

దిశ, తుంగతుర్తి : సాధారణంగా ఒక వ్యక్తి రెండు బాధ్యతలు నిర్వహించడం చాలా అరుదు అని చెప్పవచ్చు. ఇక్కడ ఓ వ్యక్తి సర్పంచ్ గా విధులు నిర్వర్తించడంతో పాటు డాక్టర్ గా కూడా కొనసాగుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం అండోయ్. నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన కుంచాల శ్రీనివాస్ రెడ్డి. ఇతను సర్పంచ్ కాకముందు పశు వైద్యశాలలో గోపాలమిత్ర ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తన సేవలతో రైతాంగంతో పాటు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. అనంతరం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవలే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయినప్పటికీ ఆయన పశు వైద్య వృత్తిని మానలేదు. బుధవారం రైతు మలిపెద్ది మల్లారెడ్డి చెందిన గర్భం దాల్చిన పశువుకు ప్రసవం కష్టతరమైంది. లోపలి దూడ పేగులు చుట్టుకుని అడ్డం తిరిగింది. దీంతో రైతు సర్పంచి శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఆయన పశు వైద్య డాక్టర్ పాత్రలో ఆ మూగజీవికి వైద్యం అందించారు.






