విద్యార్థులు చలికి తట్టుకునేలా రగ్గులు పంపిణి చేయాలి : ఎస్ఎఫ్ఐ

by Nallavelli.Anjaneyulu |

దిశ, దేవరకొండ టౌన్ : సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు చలికి తట్టుకునే రగ్గులు పంపిణి చేయాలి అని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణ కేంద్రంలోని

విద్యార్థులు చలికి తట్టుకునేలా రగ్గులు పంపిణి చేయాలి : ఎస్ఎఫ్ఐ
X

దిశ, దేవరకొండ టౌన్ : సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు చలికి తట్టుకునే రగ్గులు పంపిణి చేయాలి అని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పెంచికల్ ప‌హాడ్ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం కార్యక్రమం నిర్వహించిది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులను గాలికి వదిలేశారని అన్నారు. హాస్టల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కస్తూర్బా గాంధీ విద్యార్థులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని పేద విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చలికాలం గజగజ వనికిపోతున్న విద్యార్థులకు అందించాల్సిన రగ్గులు ఈయకపోవడం వలన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని నెట్టుకోస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు.

తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉండే విద్యార్థులకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు చలికి తట్టుకుంటే దుప్పట్లను, రగ్గులు మరియు విద్యార్థులకు ఉన్ని స్వెటర్లు అందించే విధంగా ప్రభుత్వంతో గాని, లేదంటే జిల్లా కలెక్టర్ స్పెషల్ గ్రాంట్ తో గాని పేద మధ్య తరగతి విద్యార్థులను తీవ్రమైన చలి నుండి కాపాడాలని విద్యార్థుల తరఫున కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి విద్యార్థులందరికీ గత ప్రభుత్వ మాదిరిగా రగ్గులను స్వెటర్లను అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, రామలింగం, అరుణ్, అభి, నవీన్, నరసింహ, శివ, అనిల్, అయాన్, అభిషేక్, గణేష్, హరిబాబు, ప్రణిత, పూజశ్రీ, దీపిక, కీర్తన, లిఖిత, బ్రాహ్మణి, అనూష, దేవిశ్రీ, బ్రాహ్మణి, అనూష, మల్లేష్, రాజేష్, గణేష్, మహేష్ పాల్గొన్నారు.

Next Story