దోపిడీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

by Ratna Kumari |

వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన దొంగ‌ను హుజూర్ న‌గ‌ర్ పోలీసులు ప‌ట్టుకున్నారు. వాహ‌నాలు త‌నిఖీ చేస్తుండ‌గా.. అనుమాన‌స్ప‌దంగా క‌నిపించ‌డంతో ప‌ట్టుకొని విచార‌ణ చేయ‌గా.. తాను చేసిన దొంగ‌త‌నాల‌ను ఒప్పుకున్న‌ట్టు హుజూర్ న‌గ‌ర్ ఎస్సై మోహ‌న్ బాబు బుధ‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో తెలిపారు.

దోపిడీలకు పాల్పడుతున్న  దొంగ అరెస్ట్
X

దిశ, హుజూర్ నగర్ : వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన దొంగ‌ను హుజూర్ న‌గ‌ర్ పోలీసులు ప‌ట్టుకున్నారు. వాహ‌నాలు త‌నిఖీ చేస్తుండ‌గా.. అనుమాన‌స్ప‌దంగా క‌నిపించ‌డంతో ప‌ట్టుకొని విచార‌ణ చేయ‌గా.. తాను చేసిన దొంగ‌త‌నాల‌ను ఒప్పుకున్న‌ట్టు హుజూర్ న‌గ‌ర్ ఎస్సై మోహ‌న్ బాబు బుధ‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ఠంప‌ల్లి క్రాస్ రోడ్డులో త‌న సిబ్బందితో క‌లిసి వాహ‌నాలు త‌నిఖీ చేస్తుండ‌గా గోవిందాపుం గ్రామానికి చెందిన కొప్పుల శ్రీకాంత్ అనే వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా వ్య‌వ‌హ‌రించాడు. ఇది గ‌మ‌నించిన అత‌న్ని ప‌ట్టుకున్న‌ట్టు తెలిపారు. అత‌ని వ‌ద్ద బంగారం, వెండి వ‌స్తువులు ల‌భించాయ‌ని తెలిపారు. అత‌న్ని విచారించా.. సుమారు రెండు నెల‌ల క్రితం హుజూర్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని వెంక‌ట్ న‌గ‌ర్ లోని ఓ ఇంట్లో బంగారు పుస్తెల‌తాడు, బంగారు చెవి దిద్దులు, గ‌త వారం రోజుల క్రితం గోవింద‌పురంలోని ఓ ఇంటిలో 3 జ‌త‌ల ప‌ట్టీలు, 3 జ‌త‌ల దిద్దులు, రోల్డ్ గోల్డ్ చైన్ ను దొంగిలించాడ‌ని ఒప్పుకున్న‌ట్టు తెలిపారు.అత‌ని వ‌ద్ద నుంచి ఒక బంగారు పుస్తెల‌తాడు, 4 జ‌త‌ల దిద్దులు, 3 జ‌త‌ల వెండి ప‌ట్టీలు, రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకొని అత‌న్ని రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు తెలిపారు. కొప్పుల శ్రీకాంత్ గ‌తంలో హుజూర్ న‌గ‌ర్, గ‌రిడేప‌ల్లి గంజాయి కేసులో ఉన్నాడ‌న్నారు. ఇత‌నిపై భార్య కేసు పెట్టింద‌ని కూడా ద‌ర్యాప్తులో ఉంద‌న్నారు.

Next Story