రోడ్డు ప్రమాదంలో రైస్ మిల్ డ్రైవర్ మృతి

by Bhanu |

మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రైస్ మిల్ డ్రైవర్ మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

రోడ్డు ప్రమాదంలో రైస్ మిల్ డ్రైవర్ మృతి
X

దిశ, మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రైస్ మిల్ డ్రైవర్ మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండల కేంద్రంలో రైస్ మిల్లు డ్రైవర్ గా పనిచేస్తున్న ఎస్ డి నాగుల్ మీరా (౪౫) బుధవారం రాత్రి గుడిబండ నుండి కందిబండ తల్లి ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా కందిబండ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నాగుల్ మీరా కాలికి, తలకు తీవ్ర గాయాలవటంతో కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయమై మృతుని భార్య రహీనా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.

Next Story