మాలల ఒత్తిడికి తలొగ్గిన రేవంత్ సర్కార్

by Naveena |

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని నిరసనకు దిగారు.

మాలల ఒత్తిడికి తలొగ్గిన రేవంత్ సర్కార్
X

దిశ,ఆత్మకూర్ ఎస్ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలతో పాటు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని నిరసనకు దిగారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ అధ్యక్షతన రెండవ రోజు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ నిరవధిక దీక్షలను చేపట్టారు. సూర్యాపేట నియోజకవర్గం ఇన్చార్జి ములకలపల్లి రవి మాదిగ హాజరై ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా, రిజర్వేషన్లు కేటాయించకుండా ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయడంతో.. మాదిగ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతనే ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలన్నారు. అప్పటివరకు ఫలితాల విడుదలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు కళానేతలు నియోజవర్గ కలనేత గంట బిక్షపతి సారధ్యంలో దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళా నేతలు పల్లెల రాము మాదిగ, లక్ష్మణ్ మాదిగ, మండల అధికార ప్రతినిధి, మిర్యాల చిన్ని మాదిగ, పల్లెల రాములు మాదిగ, శ్రావణ్ మాదిగ, మహేష్ మాదిగ, ఎలంధర్ మాదిగ, శేఖర్ మాదిగ చింటూ మాదిగ, రాకేష్ మాదిగ, శీను మాదిగ, మహేష్ మాదిగ, ప్రియాంక మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Next Story