మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి రెడీ.. రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ

by I. Sairam |

జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు ముందస్తుగానే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీల దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి రెడీ.. రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ
X

దిశ హుజూర్ నగర్: జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు ముందస్తుగానే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీల దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నేరేడుచర్ల కోదాడ సూర్యాపేట తిరుమలగిరి మున్సిపాలిటీలలో గత ఎన్నికలలో అప్పటి అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. అయితే ఈసారి మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. దాని తగ్గట్టుకునే ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ కూడా అదే తరహాలో నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కూడా పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. అయితే చైర్మన్ రిజర్వేషన్ తో పాటు వార్డ్ రిజర్వేషన్లు ఇంకా పూర్తి కాకపోయినా ఏ రిజర్వేషన్ ఏది వస్తే ఎవరి పోటీ చేయాలన్నది ఇప్పటికే పార్టీలలో నాయకులు చర్చించుకుని అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ ప్రకారం వార్డుల్లో బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు ముందస్తుగానే వ్యూహాలను రచిస్తున్నారు.

గతంలో రిజర్వేషన్ ఇవే..

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల సంబంధించి చైర్మన్ అభ్యర్థికి ఏ రిజర్వేషన్ కేటాయిస్తారనేది సర్వత్ర చర్చగా మారింది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ,సూర్యాపేట, కోదాడ చైర్మన్ సీటు గతంలో జనరల్ మహిళా అయింది . అలాగే నేరేడుచర్ల ఎస్సీ జనరల్ కాగా తిరుమలగిరి ఎస్సీ మహిళా రిజర్వేషన్లు అయ్యాయి. అయితే ఈసారి ఏ మున్సిపాలిటీలు ఏ రిజర్వేషన్ అవుతాయని చర్చ జరుగుతుంది.

రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ..

హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట గతంలో జనరల్ మహిళా కావడంతో ఈసారి హుజూర్ నగర్ బీసీ అవుతుందని కోదాడ ఎస్టీ రిజర్వేషన్ అవుతుందని సూర్యాపేట జనరల్ అవుతుందని కొందరు .. మరి కొందరు బీసీ అవుతుందని ఎవరు అంచనా వారు వేసుకుంటున్నారు.నేరేడుచర్ల గతంలో ఎస్సీ జనరల్ కాగా ఈసారి జనరల్ మహిళా అవుతుందని స్థానికులు నాయకులు రిజర్వేషన్లను అంచనాలు వేసుకుంటున్నారు. తిరుమలగిరి బీసీ కానీ జనరల్ కానీ కావచ్చు అని అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ నాయకులు అనే విధంగా రిజర్వేషన్లు జరుగుతాయా లేక అనుకోని విధంగా ఏమైనా తారుమారు అయితాయ అనేది తెలియాల్సి ఉంది.

అధికార పార్టీల అభ్యర్థులకు దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ..

మున్సిపాలిటీలోని వార్డులకు కౌన్సిలర్ గా అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఆశ వాదులు . గతంలో అయినా రిజర్వేషన్ అక్కడ ఉన్న పాపులేషన్ ప్రకారం ఇప్పటికే ఏ వార్డు ఏది రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉన్నది అనేది స్థానికంగా నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక వేళ ఒక వార్డు రిజర్వేషన్ మారితే దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటిస్తుంది.. వారు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటిస్తే వారిపై గెలిచే అవకాశాలుంటాయి .అనే విధంగా వ్యూహరచన చేస్తున్నాయి. ఒక వేల రిజర్వేషన్ చేంజ్ అయితే ఇది వస్తే ఎవరిని పెట్టాలి అనేది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ఎవరికివారు చర్చించుకుంటున్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికలతో బీఆర్ఎస్ లో కొంత జోష్..

స్థానికంగా జరిగిన గ్రామపంచాయతీలలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్న ఆశించిన స్థానాలు రాకపోవడం ఆ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో పార్టీ క్యాడర్లో కొంత జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. బిఆర్ఎస్ పార్టీ మద్దతుగా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీ చేసి ఈసారి మున్సిపాలిటీలో పగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చి జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలలో మిగతా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, టీడీపీ జనసేన కమ్యూనిస్టు పార్టీలు వంటివి తమతో కలిసి వస్తే కలుపుకొని పోటీ చేసేందుకు కూడా కొన్ని చోట్ల చర్చలు జరుగుతున్నట్లు కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో 5 మున్సిపాలిటీలలో అత్యధిక వార్డులు గెల్పొంది చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తుంది. వచ్చే ఎన్నికలు ఏవైనా తమకు ఎదురు లేదు అనే విధంగా 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని వ్యూహంలో ఉన్నారు.

తమకు చైర్మన్ పదవి కేటాయించాలంటూ...

మున్సిపల్ ఎన్నికలు తెరమీదకి రావడంతో మున్సిపల్ చైర్మన్ పదవి పలానా రిజర్వేషన్ అయితే తనకే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ హుజూర్ నగర్ నేరేడుచర్ల కోదాడ సూర్యాపేట తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని నాయకులు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలను రాష్ట్ర నాయకులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తోపాటు రాష్ట్ర టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని కలిసి తమకు అవకాశాన్ని ఇవ్వాలంటూ ఇప్పటికే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

Next Story