- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ లబ్ధిదారుల కళ్లలో ఆనందం నింపిన ఆర్.డి.ఓ కృష్ణారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్.డి.ఓ కృష్ణారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నెల 5న అడ్డగూడూర్ మండల తహసీల్దార్

దిశ, అడ్డగూడూర్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్.డి.ఓ కృష్ణారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నెల 5న అడ్డగూడూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి దరఖాస్తులు, రేషన్ కార్డుల పరిశీలన చేపట్టారు. అనంతరం మానాయికుంట గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడిన ఆర్.డి.ఓ, నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుప, ఇసుక ధరల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల్లో ఒకరైన బోడ చంద్రయ్య స్థానిక సిమెంట్ డీలర్ ఒక్కో బస్తా రూ.350కి విక్రయిస్తున్నాడని, తాము తెచ్చుకున్న సిమెంట్‌ను దింపిన తర్వాత డీలర్ బస్తాలను వెనక్కి పంపించాల్సి వచ్చిందని ఫిర్యాదు చేశారు.
ఆర్.డి.ఓ కృష్ణారెడ్డి వెంటనే స్పందించి భువనగిరి సిమెంట్ యాజమాన్యంతో మాట్లాడి బస్తా ధరను రూ.275కి తేగించారు. బుధవారం నాటికి మానాయికుంట గ్రామ లబ్ధిదారులకు ఆ ధరకు సరఫరా జరిగిందిగా అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్.డి.ఓ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శేషగిరిరావు, ఆర్.ఐ. ఉపేందర్, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్, లబ్ధిదారులు బోడ చంద్రయ్య, బోడ గంగయ్య, ఉడుగు మరయ్య, బోడ మంజుల, ననుబోతు ఐలయ్య, తీగల సైదులు తదితరులు పాల్గొన్నారు.






