భువనగిరి డీఎస్పీ గా రవీందర్

by Ratna Kumari |

భువనగిరి డీఎస్పీగా రవీందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

భువనగిరి డీఎస్పీ గా రవీందర్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి డీఎస్పీగా రవీందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన రాహుల్ రెడ్డి బదిలీ పై వెళ్లగా ఆయ‌న‌ స్థానంలో రవీందర్ డీఎస్పీ గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూత‌న డీఎస్పీ ర‌వీంద‌ర్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సామాజిక స్పృహతో మెలగాలని సూచించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భువనగిరి డివిజన్ లో ఉన్న ప్రజలు పోలీసులకు సహకరించినట్లయితే శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Next Story