Hanumakonda :హనుమకొండలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

by Dishanational1 |
Hanumakonda :హనుమకొండలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు
X

దిశ, హనుమకొండ టౌన్: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ములుగు రోడ్డు నుండి హనుమకొండ చౌరస్తా మీదుగా అశోక జంక్షన్ వరకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ ఏఎఫ్) కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క విధివిధానాలు, వారి ప్రాముఖ్యత, ఎన్నికలు మరియు లా అండ్ ఆర్డర్ విషయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లోకల్ పోలీస్ తో కలిసి ఏ విధంగా నియంత్రిస్తారు అని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ కలిసి పుల్వామా దాడిని గుర్తు చేసుకుంటూ అమరులకు నివాళి అర్పిస్తూ, మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఇన్చార్జి ఏసీపీ జీ. కృష్ణ , హనుమకొండ ఎస్ హెచ్ ఓ, ఎస్సైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.





Next Story

Most Viewed